అటవీ సంరక్షణలో యువ ఐఎఫ్ఎస్ అధికారుల పాత్ర కీలకం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
అటవీ సంరక్షణలో యువ ఐఎఫ్ఎస్ అధికారుల పాత్ర కీలకం
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మర్యాదపూర్వక భేటీ
- అంకితభావంతో సేవలు అందించాలి: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, జనవరి 9 (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ క్యాడర్‌లో ఇటీవల నియమితులైన యువ ఐఎఫ్ఎస్ అధికారులు అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ప్రకృతి పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అటవీ సంపదను కాపాడటంతో పాటు జీవ వైవిధ్యాన్ని సంరక్షించడంలో యువ అధికారుల కృషి భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవాలని ఆమె సూచించారు.
అటవీ చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అంకితభావంతో పనిచేయాలని యువ ఐఎఫ్ఎస్ అధికారులకు మంత్రి సూచించారు. అటవీ సంరక్షణను ప్రజా భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని, పర్యావరణ సమతుల్యతకు కట్టుబడి విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Comments

