టెక్కలిలో రూ.15 కోట్లతో సమగ్ర ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
టెక్కలిలో రూ.15 కోట్లతో సమగ్ర ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం
- 50 పడకల సౌకర్యంతో ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్య సేవలు
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో ఉత్తర్వులు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్): శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో రూ.15 కోట్ల వ్యయంతో 50 పడకల సామర్థ్యం గల సమగ్ర ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్య విధానాలను సామాన్యులకు సైతం చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సమగ్ర వైద్య సేవలు ఒకేచోట అందుబాటులోకి రావడం ద్వారా ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని తెలిపారు.
టెక్కలి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం ఆ దిశలో మరో ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, సమగ్ర ఆయుష్ ఆసుపత్రి ద్వారా స్థానికులకు విశేష ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు.
Comments
