టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆసుపత్రిలో అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఆసుపత్రిలో అభిషేక్ శర్మ
ఢిల్లీ, ఫిబ్రవరి 11 –పీపుల్స్ మోటివేషన్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పొట్టలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరడంతో, ఈ మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడుపు నొప్పితో బాధపడుతున్న అభిషేక్‌ను సోమవారం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హాజరు కాలేదు.
అభిషేక్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై జట్టు సహాయక కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పందిస్తూ, అతడు పొట్టలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే నమీబియాతో మ్యాచ్‌లో అతడి లభ్యతపై తుది నిర్ణయం తీసుకుంటామని జట్టు యాజమాన్యం తెలిపింది.
యూఎస్‌ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే జ్వరంతో బాధపడుతూ బరిలోకి దిగిన అభిషేక్ డకౌట్ అయ్యాడు. అనంతరం ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. ఇక ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో, ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో కీలక మ్యాచ్‌లు ఉండటంతో, అతడి విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా విశ్రాంతినివ్వాలనే ఆలోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు సమాచారం.
అభిషేక్ గైర్హాజరీతో ఓపెనర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడం గమనార్హం. బుధవారం సాయంత్రం జరిగే చివరి ప్రాక్టీస్ తర్వాత తుది జట్టుపై స్పష్టత రానుంది.
