టీ20 వరల్డ్ కప్‌లో ఆసీస్‌కు షాక్.. గాయంతో కెప్టెన్ మార్ష్ ఔట్
టీ20 వరల్డ్ కప్‌లో ఆసీస్‌కు షాక్.. గాయంతో కెప్టెన్ మార్ష్ ఔట్
కొలంబో, ఫిబ్రవరి 11 – పీపుల్స్ మోటివేషన్
టీ20 ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు టోర్నీ ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ ప్రాక్టీస్ సమయంలో గాయపడి కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. గజ్జల్లో బంతి బలంగా తగలడంతో అతనికి అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
ఈ గాయంతో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు మార్ష్ అందుబాటులో లేడు. అతని స్థానంలో ట్రావిస్ హెడ్ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. మార్ష్‌కు తీవ్రమైన నొప్పి ఉండడంతో కొంతకాలం విశ్రాంతి అవసరమని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. వైద్యుల సూచనల మేరకు అతని తిరిగి రాకపై నిర్ణయం తీసుకోనున్నారు.
ముందుజాగ్రత్త చర్యగా స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను శ్రీలంకకు రావాల్సిందిగా జట్టు యాజమాన్యం సూచించింది. అవసరమైతే అతన్ని జట్టులో చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ వంటి కీలక బౌలర్లు గాయాలతో దూరంగా ఉండగా, ఇప్పుడు కెప్టెన్ మార్ష్ గాయం ఆస్ట్రేలియా జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
అయితే మరోవైపు పేసర్ నాథన్ ఎల్లిస్ గాయం నుంచి కోలుకుని ఐర్లాండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవడం ఆసీస్‌కు కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. టోర్నీ ఆరంభ దశలోనే కీలక ఆటగాళ్లు గాయపడటం ఆస్ట్రేలియా అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
