రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నెక్నాంపూర్‌లో 54 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నెక్నాంపూర్‌లో 54 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా

  • 2700 గజాల ప్రజావసరాల స్థలం స్వాధీనం
  • అనుమతి ఒకచోట… నిర్మాణం మరొకచోట వెలుగులోకి
  • ఫెన్సింగ్ వేసి పబ్లిక్ స్పేస్ బోర్డులు ఏర్పాటు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (పీపుల్స్ మోటివేషన్):
హైడ్రా సంస్థ హైడ్రా నెక్నాంపూర్‌లో విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. సుమారు 2700 గజాల ప్రజావసరాల స్థలాన్ని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకుని, దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈ భూమి మార్కెట్ విలువ సుమారు 54 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నెక్నాంపూర్ గ్రామంలోని సర్వే నంబరు 31లో 59.14 ఎకరాల ప్రభుత్వ భూమి 2002లో సచివాలయ ఉద్యోగులకు కేటాయించబడింది. 2007లో అనుమతులతో లేఅవుట్ రూపొందించి, ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. లేఅవుట్ ప్రకారం 2700 గజాలు పార్కు మరియు ఇతర ప్రజావసరాల కోసం కేటాయించగా, కొంతమంది దానిని ప్లాట్లుగా మార్చి విక్రయించినట్లు విచారణలో బయటపడింది. సచివాలయ ఉద్యోగుల కాలనీకి ఆనుకుని ఉన్న సర్వే నంబరు 22లోని వెంకటేశ్వర కాలనీ ప్లాట్‌ను చూపించి నిర్మాణ అనుమతి తీసుకుని, వాస్తవానికి పార్కు స్థలంలో నిర్మాణాలు చేపట్టిన ఘటన వెలుగుచూసింది. పునాదులు, స్తంభాలు వేసి స్లాబ్ దశకు చేరుకున్న నిర్మాణాలను హైడ్రా అధికారులు నిలిపివేశారు. కాలనీ సంక్షేమ సంఘం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను తొలగించారు. అదనంగా గుట్టను ప్లాట్లుగా మార్చి విక్రయించిన మరో ఐదు ప్లాట్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను కూడా తొలగించారు. మొత్తం 2700 గజాల ప్రజావసరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, పబ్లిక్ స్పేస్‌గా బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా కఠిన చర్యలు కొనసాగిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

-Advertisement-