వెలుగుమట్ల ఘటనపై మంత్రి పొంగులేటి స్పష్టీకరణ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
వెలుగుమట్ల ఘటనపై మంత్రి పొంగులేటి స్పష్టీకరణ
- బిఆర్ఎస్ హయాంలోనే గుడిసెల కూల్చివేత జరిగిందని ఆరోపణ
- పేదల పేరుతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న విమర్శ
- అర్హులైన వారికి ఇల్లు, స్థలం ఇస్తామని హామీ
ఖమ్మం, ఫిబ్రవరి 26 (పీపుల్స్ మోటివేషన్): మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెలుగుమట్లలో పేదల గుడిసెల కూల్చివేత అంశంపై మీడియా సమావేశంలో స్పందించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2023 జూలై 15న వెలుగుమట్లలో పేదల గుడిసెలను కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు అదే నాయకులు పేదల ఇళ్లు కూలగొడుతున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పేదలపై ప్రేమ ఉన్నట్టు గోబెల్స్ తరహా ప్రచారం చేయడం సరికాదని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం పేదల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిందని, నిజమైన ఏ పేదవాడినీ ఇబ్బంది పెట్టబోమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో బాధితులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. నష్టపోయిన పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. వాస్తవాలను ప్రజల ముందుంచుతామని, పేదల సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
Comments
