బంగారం కిందకు.. వెండి పైకి..
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
బంగారం కిందకు.. వెండి పైకి..
హైదరాబాద్ – ఫిబ్రవరి 12 – పీపుల్స్ మోటివేషన్
గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. మరోవైపు ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు మళ్లీ పెరిగాయి. బంగారం ధర గ్రాముకు సుమారు రూ.1200 వరకు తగ్గగా.. వెండి కిలోకు రూ.5000 మేర పెరిగింది.
ఫిబ్రవరి 12 ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,400గా నమోదైంది. ఇది నిన్నటి ధరతో పోలిస్తే రూ.1200 తక్కువ. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,200గా ఉండగా, ఇది రూ.1100 తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,550గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,350గా కొనసాగుతోంది.
ఇక వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3 లక్షలకు చేరుకుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.95 లక్షలుగా ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే వెండి కిలోకు సుమారు రూ.5000 పెరుగుదల నమోదైంది.
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ మార్పులు, డాలర్ మారకం విలువ, డిమాండ్ వంటి అంశాలపై ఆధారపడి తరచూ మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు తాజా ధరలు తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
