రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హిందూపురం కాల్పుల ఘటనపై ఎస్పీ స్పష్టత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హిందూపురం కాల్పుల ఘటనపై ఎస్పీ స్పష్టత

- ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిగాయి

- సీఐ, కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన రౌడీషీటర్

- ఏపీ–కర్నాటకలో పలు కేసుల్లో నిందితుడు నాగేంద్ర

హిందూపురం, ఫిబ్రవరి 7 (పీపుల్స్ మోటివేషన్): హిందూపురంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై జిల్లా ఎస్పీ సతీష్ స్పష్టత ఇచ్చారు. ఆత్మరక్షణ కోసమే రౌడీషీటర్‌పై సీఐ కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు. విధి నిర్వహణలో భాగంగా అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో రౌడీషీటర్ దాడికి పాల్పడటంతో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఎస్పీ వివరాల ప్రకారం, హిందూపురం రౌడీషీటర్ కావడి నాగేంద్రను అరెస్ట్ చేసేందుకు సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవి వెళ్లారు. ఈ క్రమంలో నాగేంద్ర కత్తితో సీఐ, కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో, తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో సీఐ ఆంజనేయులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రౌడీషీటర్ కావడి నాగేంద్రపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక రాష్ట్రాల్లో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ తెలిపారు. హిందూపురంలో సంచలనం సృష్టించిన అత్తా–కోడళ్ల గ్యాంగ్ రేప్ కేసులో కూడా నాగేంద్ర నిందితుడిగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనలో గాయపడిన సీఐ ఆంజనేయులు, కానిస్టేబుల్ రవి, రౌడీషీటర్ నాగేంద్ర హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోందని ఎస్పీ సతీష్ వెల్లడించారు.

Comments

-Advertisement-