మీ ఆరోగ్యం – మా బాధ్యత
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మీ ఆరోగ్యం – మా బాధ్యత
- ఎన్.టి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య రథం
- నిపుణులైన వైద్యులతో ఉచిత పరీక్షలు, మందులు
- గ్రామాల వారీగా ఆరోగ్య శిబిరాల నిర్వహణ
చిత్తూరు జిల్లా, ఫిబ్రవరి 11 (పీపుల్స్ మోటివేషన్): ఎన్.టి.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘ఎన్.టి.ఆర్ సంజీవని – ఉచిత ఆరోగ్య రథం’ కార్యక్రమం గ్రామాల వారీగా నిర్వహించబడుతోంది. ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. నిపుణులైన వైద్యులు పాల్గొని వివిధ ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించి అవసరమైన ఔషధాలను ఉచితంగా అందించనున్నారు.
ఈ ఆరోగ్య రథం కార్యక్రమం క్రింది గ్రామాల్లో నిర్వహించబడుతుంది. ఫిబ్రవరి 12న బైరెడ్డిపల్లి మండలంలోని నెల్లిపట్ల గ్రామంలో శిబిరం జరుగుతుంది. ఫిబ్రవరి 13న రామకుప్పం మండలంలోని రాజుపేట గ్రామంలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 14న పెద్దపంజాణి మండలంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయబడుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు పాల్గొని తమ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ట్రస్ట్ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
Comments
