రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

దివ్యాంగ క్రీడాకారులకు అండగా నిలిచిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

దివ్యాంగ క్రీడాకారులకు అండగా నిలిచిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

- క్రీడలకు ప్రోత్సాహం మా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం

- దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో భేటీ

- మాట నిలబెట్టి క్రికెట్ కిట్లు అందజేత

చంద్రగిరి, ఫిబ్రవరి 11 (పీపుల్స్ మోటివేషన్): క్రీడలను ప్రోత్సహించడం మా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ప్రత్యేకంగా దివ్యాంగులు క్రీడలలో రాణించేలా చూడాలని, వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మంగళవారం సాయంత్రం దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలను వివరించి క్రికెట్ కిట్ అవసరమని తెలియజేశారు. సభ్యుల అభ్యర్థనను వెంటనే పరిగణనలోకి తీసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన కిట్లను అందజేయాలని అధికారులకు సూచించారు. బుధవారం ఉదయం ఎమ్మెల్యే కార్యాలయంలో సిబ్బంది ద్వారా దివ్యాంగ క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందజేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పటికీ మాట నిలబెట్టి కిట్లు అందించడంతో ఆనందంగా ఉందని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే పులివర్తి నాని తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సభ్యులు పేర్కొన్నారు. క్రీడల ద్వారా దివ్యాంగుల ప్రతిభను ప్రపంచానికి చాటుతామని వారు తెలిపారు.

Comments

-Advertisement-