రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వెలిగొండకు నూతన ఊపు..

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వెలిగొండకు నూతన ఊపు.. 

  • ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు సీఎం శంకుస్థాపన
  • రూ.456 కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం
  • రైతులతో క్షేత్రస్థాయిలో సమీక్ష
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో చర్చ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మార్కాపురం, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటించి వెలిగొండ ప్రాజెక్టుకు కీలకమైన ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద రూ.456 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు వేగవంతానికి దిశానిర్దేశం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఎడారిలా మారిన ప్రాంతాలకు నీరందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్ లైనింగ్ పూర్తైతే నీటి వృథా తగ్గడంతో పాటు సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే వేలాది ఎకరాలకు సాగునీరు అంది రైతుల జీవనోపాధి బలోపేతం అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండివీరారెడ్డితో కలిసి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు నమూనాను వీక్షించి, రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సాగునీరు ఎప్పుడు అందుతుందనే అంశంపై రైతులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చి, పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం వెలిగొండ టన్నెల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులపై వివిధ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆలస్యం లేకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను సమయపాలనతో పూర్తి చేయడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు.

Comments

-Advertisement-