రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కన్న కూతురిని హతమార్చిన తల్లి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కన్న కూతురిని హతమార్చిన తల్లి

- ప్రియుడు కోసం పసిపాప ప్రాణాలు బలి

- గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టిన దారుణం

- ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితురాలి అరెస్ట్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

తిరుపతి, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
తిరుపతిలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. రెండున్నర ఏళ్ల చిన్నారి దుర్గను ఆమె తల్లి ఆశలతా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియుడి మోజులో పడి కన్న ప్రేమను మరిచిన తల్లి ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పెళ్లికి అడ్డొస్తుందనే నెపంతో చిన్నారిని హతమార్చిన ఆశలతా, అనంతరం గుట్టుచప్పుడు కాకుండా పాప మృతదేహాన్ని పాతిపెట్టినట్లు సమాచారం. మనవరాలు కనిపించడం లేదని అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆశలతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఏర్పేడు మండలం పాపానాయుడు పేట సమీపంలోని స్వర్ణముఖి నది ఒడ్డున మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు ఆమె చెప్పినట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో ఎమ్మార్వో సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించనున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Comments

-Advertisement-