రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాజమహేంద్రవరంలో ఐదు వేల అడుగుల నడక కార్యక్రమం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రాజమహేంద్రవరంలో ఐదు వేల అడుగుల నడక కార్యక్రమం

- ఆరోగ్య అవగాహనకు డా. భద్రమ్స్ ఫిల్మ్ హౌస్ ముందడుగు

- విద్యార్థులు, వాకర్స్ క్లబ్ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి 

- చురుకైన జీవనశైలికి ప్రోత్సాహం అవసరమని సూచన

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్): రాజమహేంద్రవరంలో డా. భద్రమ్స్ ఫిల్మ్ హౌస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐదు వేల అడుగుల నడక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు, జవహర్ వాకర్స్ క్లబ్ సభ్యులు తదితరులతో కలిసి మంత్రి నడకలో పాల్గొని ఆరోగ్య చైతన్యానికి మద్దతు తెలిపారు.



ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిరోజూ కనీసం ఐదు వేల అడుగులు నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమని చెప్పారు. యువత చిన్నప్పటి నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందిస్తూ ప్రజలను చురుకైన జీవనశైలికి ప్రోత్సహించే కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో సానుకూల మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-