రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రక్షణ–విమానయాన రంగాల్లో ఏపీకి భారీ అవకాశాలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రక్షణ–విమానయాన రంగాల్లో ఏపీకి భారీ అవకాశాలు

- ముఖ్యమంత్రి చంద్రబాబుతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల విస్తృత చర్చ

- రక్షణ తయారీ, ఏరోస్పేస్ విస్తరణపై సమగ్ర ప్రజెంటేషన్

- పెట్టుబడులకు ఏపీ సిద్ధమని సీఎం స్పష్టం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధులు సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. రక్షణ, విమానయాన రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి సంస్థ చైర్మన్ మరియు ప్రధాన కార్యనిర్వాహణ అధికారి ఉదయంత్ మల్హోత్రా, ఏరోస్పేస్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పీ. చలపతి, డైరెక్టర్ అహిల్యా మల్హోత్రా, ప్రధాన కార్యనిర్వాహణ అధికారి ఆండ్రియా మిలానీ, యూరప్ వ్యాపార కార్యకలాపాల సీనియర్ ప్రతినిధి క్రిస్టినా లిడేగార్డ్ హాజరయ్యారు. సంస్థ ప్రతినిధులు రక్షణ తయారీ, ఏరోస్పేస్ విభాగాల్లో తమ సంస్థకు ఉన్న సాంకేతిక నైపుణ్యం, అంతర్జాతీయ అనుభవం, భాగస్వామ్యాలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. యుద్ధ విమానాల భాగాలు, ఆధునిక రక్షణ పరికరాల తయారీ, గ్లోబల్ సరఫరా గొలుసులో తమ సంస్థ పాత్ర వంటి అంశాలను వివరించారు. భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరణకు ఆసక్తి ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల అనుకూల విధానాలు, పారిశ్రామిక కారిడార్లు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, పోర్టులు, రవాణా మౌలిక వసతుల గురించి వివరించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా అధునాతన పరిశ్రమలను ఆకర్షించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పెట్టుబడులకు అవసరమైన అనుమతులు, భూమి కేటాయింపులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. రక్షణ, విమానయాన రంగాల్లో పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు దేశ భద్రతా సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Comments

-Advertisement-