విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి సాయం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ. కోటి సాయం
- ప్రమోద్ భార్య ప్రణీతకు చెక్కు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
నిజామాబాద్, ఫిబ్రవరి 06 (పీపుల్స్ మోటివేషన్):
గతేడాది విధి నిర్వహణలో దుండగుల కత్తిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 1 కోటి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రమోద్ భార్య ప్రణీత గారికి రూ. 1 కోటి చెక్కును అందజేశారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రమోద్ త్యాగం ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసే పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని సీఎం తెలిపారు. ఇలాంటి ఘటనల్లో బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
