రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమగ్ర సమీక్ష

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలపై సమగ్ర సమీక్ష

- భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 06 (పీపుల్స్ మోటివేషన్):

శ్రీకాళహస్తిలో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఈ రోజు సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సమక్షంలో జరిగింది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. దర్శన క్యూలైన్లు, త్రాగునీటి వసతి, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల నివారణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు, శ్రీకాళహస్తి ఆలయం ఈవో, ఆలయ చైర్మన్, బోర్డు సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించారు.

Comments

-Advertisement-