రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు

  • “18 రోజులు సినిమా చూపించారు.. హీరో నేనే” అంటూ పెమ్మసాని పై విమర్శలు
  • అరెస్టు, రిమాండ్‌పై పోలీసుల చర్యలపై ఆరోపణలు
  • రాజకీయ వేడిమి పెంచిన మీడియా సమావేశం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్):
మూడు వేర్వేరు కేసుల్లో అరెస్టై 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు బెయిల్ మంజూరుతో జైలు నుంచి విడుదలయ్యారు. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “24 గంటల్లో సినిమా చూపిస్తానన్నావ్... 18 రోజులు సినిమా చూపించావు. ఇందులో హీరో నేనే... మీరు విలన్లు అయ్యారు” అని వ్యాఖ్యానించారు. జనవరి 31 అర్ధరాత్రి నల్లపాడు పోలీసులు తనను అరెస్టు చేశారని తెలిపారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైనప్పటికీ, ఈ 18 రోజులు మాట్లాడే అవకాశం లేకపోయిందన్నారు. తన కుమార్తె పరిస్థితులపై ప్రజలకు వివరాలు చెప్పిందని పేర్కొన్నారు. ఒక పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు వెళ్లి అది మంచి పద్ధతి కాదని చెప్పే ప్రయత్నమే చేశానని, ఫ్లెక్సీని తానే చించలేదని స్పష్టం చేశారు. తర్వాత రోజు ఆలయాల్లో పూజలు చేయాలని పార్టీ నుంచి సమాచారం రావడంతో అనుమతి తీసుకుని వెళ్లినట్లు చెప్పారు. తిరిగి వస్తుండగా తన వాహనాన్ని అడ్డుకుని దూషణలు చేశారని, ఆ సందర్భంలోనే తాను కూడా స్పందించానన్నారు. అనంతరం ఇంటికి వచ్చాక తాను మాట్లాడిన మాటలపై పశ్చాత్తాపం కలిగిందని, అవి చంద్రబాబును ఉద్దేశించి కాదని తెలిపారు.

ఇంటివద్దకు భారీగా జనం వచ్చారని, కొన్ని గంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదన్నారు. పోలీసుల అండతో దాడి జరిగిందని ఆరోపించారు. తనను స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రి వేళల్లో భయపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. రిమాండ్ నివేదికలో తాను కులవివక్ష వ్యాఖ్యలు చేశానని రాయడం సరికాదని అన్నారు. తాను ఎలాంటి కుల వ్యతిరేకి కాదని, కులాల పేరుతో రాజకీయ లాభాలు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పెమ్మసాని చంద్రశేఖర్ తన చర్యలకు మూల్యం చెల్లించే రోజు వస్తుందని హెచ్చరించారు. పోలీసులను రాజకీయంగా ఉపయోగించడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మొత్తం ఘటనపై న్యాయపోరాటం కొనసాగిస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వాతావరణం వేడెక్కింది.

Comments

-Advertisement-