రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

శాసనమండలిలో మహాపచారం ఆరోపణలు.. రాజకీయ దుమారం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

శాసనమండలిలో మహాపచారం ఆరోపణలు.. రాజకీయ దుమారం

  • వెంకటేశ్వర స్వామి చిత్రాలతో వైఎస్సార్సీపీ ఆందోళనపై వివాదం
  • కూటమి నేతల ఆగ్రహం.. కఠిన చర్యల డిమాండ్
  • సభ వాయిదా.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్):
శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. వెంకటేశ్వర స్వామి చిత్రాలను పట్టుకుని చెప్పులు, బూట్లు ధరించినట్టుగా ప్రవర్తించారని కూటమి నేతలు ఆరోపిస్తూ దీనిని మహాపచారంగా అభివర్ణించారు. సభలో ఈ ఘటనపై తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గందరగోళ పరిస్థితుల మధ్య మండలి ఛైర్మన్ సభను వాయిదా వేశారు. సభ వాయిదా అనంతరం వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులు, స్వామి చిత్రాలను టేబుల్‌పై వదిలి వెళ్లారని కూటమి నేతలు ఆరోపించారు. ఈ చర్య హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని మంత్రులు మండిపడ్డారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలోనే తీవ్రంగా స్పందించారు. దేవుడికి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తదనంతరం మంత్రి లోకేశ్ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మండలి ఛైర్మన్‌ను కలిసి వైఎస్సార్సీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పేవరకు విషయాన్ని వదిలిపెట్టమని హెచ్చరించారు. మండలి ఛైర్మన్ సభ్యులను పిలిచి మాట్లాడతానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల తీరు కారణంగా వరుసగా నాలుగో రోజు కూడా శాసనమండలి దద్దరిల్లిందని కూటమి, పీడీఎఫ్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు చర్చకు నోచుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Comments

-Advertisement-