రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భారత్–ఈయూ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం: జై శంకర్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

భారత్–ఈయూ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం: జై శంకర్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ భారత్–ఈయూ ఫోరం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం రెండు దేశాల భాగస్వామ్యానికి గేమ్‌చేంజర్‌గా మారిందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందంతో పాటు భద్రత, రక్షణ, వాతావరణ మార్పు, సాంకేతికత, ప్రతిభా మార్పిడులు వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని జై శంకర్ వివరించారు. ఈ అంశాలన్నింటిలో భారత్–ఈయూ సహకారం మరింత విస్తరించే అవకాశం ఉందన్నారు. భవిష్యత్‌లో గ్లోబల్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, ఈయూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. పరస్పర నమ్మకం, వ్యూహాత్మక అవగాహనతో ముందుకు సాగితే ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని అభిప్రాయపడ్డారు.

భారత్–ఈయూ ఫోరం ద్వారా రెండు పక్షాల మధ్య మరింత చర్చలు జరిగి, అభిప్రాయ సమన్వయం పెరుగుతుందని జై శంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫోరం భాగస్వామ్యానికి కొత్త దిశను చూపుతుందని తెలిపారు.

Comments

-Advertisement-