రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

లుకేమియా బాధిత చిన్నారికి సీఎం రేవంత్ రెడ్డి తక్షణ సహాయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

లుకేమియా బాధిత చిన్నారికి సీఎం రేవంత్ రెడ్డి తక్షణ సహాయం

  • రెండేళ్ల చిన్నారికి అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా నిర్ధారణ
  • వెంటనే వైద్య చికిత్సకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు
  • బసవతారకం ఇండో–అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్సకు ఏర్పాట్లు
  • చికిత్స ఖర్చుల కోసం ఎల్ఓసీ జారీకి నిర్ణయం

ఫిబ్రవరి 6 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి ఫినెహాస్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. చిన్నారికి తక్షణ వైద్య చికిత్స అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు వెంటనే చిన్నారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. అలాగే బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అధికారులతో మాట్లాడి, చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. చికిత్స ఆలస్యం కాకుండా తక్షణమే వైద్య సేవలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. చిన్నారి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుల భారం కుటుంబంపై పడకుండా ప్రభుత్వం తరఫున సహకారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఎల్ఓసీ జారీ చేయనున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎప్పుడూ పేదలు, బాధితుల పక్షానే ఉంటుందని, ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని అధికారులు పేర్కొన్నారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-