మున్సిపల్ ఎన్నికలపై జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
మున్సిపల్ ఎన్నికలపై జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం
- తెలంగాణ జనసేన నేతలతో సమావేశం
- 7, 8 తేదీల్లో ప్రచారంలో పాల్గొంటానన్న ప్రకటన
- జనసేన అభ్యర్థులు, బీజేపీకి మద్దతు
- ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగాలని సూచన
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (పీపుల్స్ మోటివేషన్):
ఈ నెల 11న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహం, ప్రచార కార్యాచరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో బలంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు, అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా తాను స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రధానంగా తీసుకుని ప్రచారం నిర్వహించాలని, అభివృద్ధి, పారదర్శక పాలన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు సూచించారు.
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన రాజకీయ బాధ్యతను స్పష్టంగా నిర్వర్తిస్తుందని, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో, ఐక్యతతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, రాజలింగం, ఆర్‌కే సాగర్‌తో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

