సర్వేపల్లిలో సాగునీటి సంక్షోభం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
సర్వేపల్లిలో సాగునీటి సంక్షోభం
- కూటమి ప్రభుత్వంపై కాకాణి తీవ్ర ఆరోపణలు
- రిజర్వాయర్లలో నీరు ఉన్నా రైతులకు అందడం లేదని విమర్శ
- కాలువల పనులు చేయకుండా దొంగ బిల్లుల ఆరోపణ
- బద్దివోలు, పేడూరు గ్రామాల్లో పర్యటన
నెల్లూరు, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్): పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దివోలు గ్రామంతో పాటు తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామాల్లో మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సాగునీటి సమస్యలు, రైతుల ఇబ్బందులపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వాయర్లలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ కాలువల పనులు సక్రమంగా చేపట్టకుండా దొంగ బిల్లులు చేసుకుంటున్నారని, లిఫ్ట్ పేరిట కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు. రైతులు సాగునీరు లేక అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి దందాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని కాకాణి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడలేదని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. యూరియా సరఫరా, విత్తనాల పంపిణీ విషయంలోనూ లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాలం చెల్లిన విత్తనాలు అందడంతో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ఈ పర్యటనలో కాకాణి ఉగ్గుమూడి రామిరెడ్డి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి వెంకట సుదీప్ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
