జనసేనలో చేరికలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
జనసేనలో చేరికలు
- ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి నాయకుల చేరిక
- పవన్ కళ్యాణ్ ఆశయాలకు మద్దతుగా కండువాలు
- రాష్ట్ర నేతల సమక్షంలో కార్యక్రమం విజయవంతం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్): కూకట్పల్లి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు ఘనంగా జనసేన పార్టీలో చేరారు. తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చేతుల మీదుగా గుండెల విజయకుమార్, శ్రీను, మహేష్, నరేష్, శ్రీనివాస్, లక్ష్మి, మల్లేష్, గుండెల పావని, ఆండాలు, బాలమ్మ తదితరులు పార్టీ కండువాలు కప్పుకొని అధికారికంగా సభ్యత్వం పొందారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక రాజకీయాల కోసం పనిచేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు మండపాక కావ్య, యువ నాయకులు యడమ రాజేష్, మహేష్, రత్న సాయి తదితరులు పాల్గొన్నారు. జనసైనికుల ఆధ్వర్యంలో కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ప్రజలకు చేరువై సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రకటించారు.
Comments
