రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నల్లమలలో కార్చిచ్చు ఆందోళన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నల్లమలలో కార్చిచ్చు ఆందోళన

- తాటిగుండాల పరిధిలో విస్తరించిన మంటలు

- శ్రీశైలం–హైదరాబాద్ మార్గం వెంబడి అడవి దగ్ధం

- అటవీ శాఖ సిబ్బంది మంటల నియంత్రణకు శ్రమ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

నల్లమల, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
నల్లమల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు సంభవించి ఆందోళన కలిగిస్తోంది. తాటిగుండాల సెక్షన్ పరిధిలోని వజ్రాల మడుగు, తవిసిపెంట, అక్క మహాదేవి గుహల వరకు అడవి ప్రాంతం మంటల్లో చిక్కుకుంది. శ్రీశైలం–హైదరాబాద్ మార్గం వెంబడి దాదాపు మూడు కిలోమీటర్ల మేర అడవి దగ్ధమవుతోందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత, గాలివేగం కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. వన్యప్రాణులకు ప్రమాదం ఏర్పడే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫైర్‌లైన్‌లను సృష్టించి మంటల వ్యాప్తిని అడ్డుకునే చర్యలు చేపట్టారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, అగ్నిమాపక వాహనాలను వినియోగించనున్నట్లు తెలిపారు.

అటవీ ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా మంటలు పెట్టడం, పొగ త్రాగి మిగిలిన పొగాకు ముక్కలను పడేయడం వంటి చర్యలు తీవ్ర ప్రమాదాలకు దారితీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. కార్చిచ్చు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.

Comments

-Advertisement-