రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జనన–మరణ నమోదు పై కొత్త నిబంధనలు అమలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జనన–మరణ నమోదు పై కొత్త నిబంధనలు అమలు

- 21 రోజుల్లోపు నమోదు తప్పనిసరి

- ఆలస్యంపై జరిమానాలు విధింపు

- ఖచ్చితమైన జనాభా గణాంకాలే లక్ష్యం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
రాష్ట్రంలో జరిగే ప్రతి జననం, మరణాన్ని తప్పనిసరిగా 21 రోజుల లోపు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు అవసరమైన పత్రాలు సమయానికి అందేలా చేయడంతో పాటు ఖచ్చితమైన జనాభా గణాంకాలను సిద్ధం చేయడమే ఈ నిర్ణయ లక్ష్యమని అధికారులు వెల్లడించారు. 21 రోజుల గడువు దాటితే ఆలస్య నమోదు పై జరిమానాలు విధించనున్నారు. 22 నుంచి 30 రోజుల మధ్య నమోదు చేస్తే 25 రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజులకు మించిన ఆలస్యంపై 250 రూపాయల జరిమానాతో పాటు రిజిస్ట్రార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సకాలంలో జనన–మరణ నమోదు చేయడం ద్వారా కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్య సేవలు, వారసత్వ హక్కులు వంటి అనేక అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు లభిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

Comments

-Advertisement-