ఎయిర్‌టెల్ నుంచి రెండు అదిరిపోయే ప్లాన్స్.. అన్‌లిమిటెడ్ డేటాతో భారీ ఆఫర్లు..!
ఎయిర్‌టెల్ నుంచి రెండు అదిరిపోయే ప్లాన్స్.. అన్‌లిమిటెడ్ డేటాతో భారీ ఆఫర్లు..!
హైదరాబాద్ – 04 ఫిబ్రవరి 2026 – పీపుల్స్ మోటివేషన్
టెలికాం రంగంలో పోటీ మరింత పెరుగుతున్న వేళ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ వినియోగం ఎక్కువగా చేసే యువత, వర్క్ ఫ్రం హోమ్, వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ చేసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని ఈ ప్లాన్‌లను రూపొందించింది.
రూ.399, రూ.449 ధరలతో వచ్చిన ఈ రెండు ప్లాన్‌లు 28 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉన్నాయి. రెండు ప్లాన్‌లలోనూ అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టిడీ, రోమింగ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ముఖ్యంగా 5జీ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా సదుపాయం అందించనుంది.
రూ.399 ప్లాన్‌లో రోజుకు 2.5జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు వినోద ప్రియుల కోసం 28 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఇస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ క్రీడా ప్రసారాలు వీక్షించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఇక రోజూ ఎక్కువ డేటా అవసరమయ్యే వారికి రూ.449 ప్లాన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. ఈ ప్లాన్‌లో రోజుకు 4జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. అదనంగా 30జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ కూడా అందిస్తోంది. ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ నిల్వ చేసుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
బడ్జెట్‌లో 5జీ వేగం, ఓటీటీ వినోదం కావాలనుకునేవారికి రూ.399 ప్లాన్ అనువైనదిగా ఉండగా.. డేటా వినియోగం ఎక్కువగా ఉండే వారికి, క్లౌడ్ స్టోరేజ్ అవసరమయ్యే వారికి రూ.449 ప్లాన్ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని టెలికాం నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లతో జియోతో పోటీకి దిగినట్టుగా కనిపిస్తోంది
