రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మధిరలో టీడీపీ హ్యాట్రిక్ విజయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మధిరలో టీడీపీ హ్యాట్రిక్ విజయం

- 17వ వార్డులో ములకలపల్లి వినయ్ కుమార్ గెలుపు

- 128 ఓట్ల మెజారిటీతో స్పష్టమైన ఆధిక్యం

- పోటీ చేసిన మూడు స్థానాల్లోనే విజయం

మధిర, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): తెలంగాణలో మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి పొత్తులో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ముచ్చటగా మూడు వార్డుల్లో విజయం సాధించింది. 17వ వార్డు నుంచి ములకలపల్లి వినయ్ కుమార్ 128 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

కౌంటింగ్ ప్రారంభం నుంచే వినయ్ కుమార్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. చివరి ఫలితాల్లో ఆయన ప్రత్యర్థిపై గణనీయమైన మెజారిటీ సాధించారు. ఈ గెలుపుతో మధిరలో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన మూడు స్థానాల్లోనే విజయం సాధించడం విశేషంగా మారింది. వంద శాతం స్ట్రైక్ రేట్‌తో మూడు స్థానాలను కైవసం చేసుకోవడం పార్టీకి ఉత్సాహాన్ని నింపింది. స్థానికంగా టీడీపీ బలాన్ని మరోసారి చాటుకున్నామని నాయకులు పేర్కొంటున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే జోష్ కొనసాగుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Comments

-Advertisement-