రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

శాసనమండలిలో గందరగోళం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

శాసనమండలిలో గందరగోళం

- శ్రీవారి చిత్రాలతో వైసీపీ నిరసన.. అధికార పక్షం ఆగ్రహం

- వాయిదా తీర్మానం తిరస్కరణతో ఉద్రిక్తత

- పరస్పర ఆరోపణలు, ఆధారాలపై సవాళ్లు


అమరావతి, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా అంశంపై చర్చకు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు తిరస్కరించడంతో వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీవారి చిత్రపటాలను ప్రదర్శించడం వివాదానికి దారితీసింది. సభలో చెప్పులు, బూట్లు ధరించి స్వామివారి చిత్రాలను పట్టుకున్నారంటూ అధికార పక్ష సభ్యులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీనిని మహాపచారంగా అభివర్ణిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గందరగోళ పరిస్థితుల్లో ఛైర్మన్ సభను వాయిదా వేశారు. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. గతంలో జరిగిన కొన్ని పరిణామాలను ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను విమర్శించారు. మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్ కూడా ఘటనను ఖండిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలను వైసీపీ శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. తమ సభ్యులు చెప్పులతో చిత్రపటాలను పట్టుకున్నారనే ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. దీనికి స్పందనగా కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. ఈ ఘటనతో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Comments

-Advertisement-