రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ దాడులు

- ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ముగ్గురు సిబ్బంది పట్టుబాటు

- సర్టిఫైడ్ కాపీ కోసం డిమాండ్.. న్యాయవాది ఫిర్యాదుతో వల

- స్టెనోగ్రాఫర్ సహా ముగ్గురిపై కేసు నమోదు


భూపాలపల్లి, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్):
భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి ముగ్గురు కోర్టు సిబ్బందిని పట్టుకున్నారు. సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి ఐదు వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టారు. స్టెనోగ్రాఫర్ పాలకుర్తి సాయి చరణ్, సిబ్బంది పున్నం రజిత, కొమ్ము సునీతలను లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలిపారు. సీహెచ్ గోపాలరావు అనే న్యాయవాది సర్టిఫైడ్ కాపీ కోసం వెళ్లగా డబ్బులు డిమాండ్ చేశారని, దీనిపై ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు సమాచారం. ఫిర్యాదు మేరకు పకడ్బందీ ప్రణాళికతో ఏసీబీ అధికారులు వల పన్ని దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సమయంలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది. న్యాయస్థానాల వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో అవినీతి చోటుచేసుకోవడం తీవ్రంగా పరిగణిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

-Advertisement-