బాల్క సుమన్ అరెస్ట్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
బాల్క సుమన్ అరెస్ట్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- అక్రమ అరెస్ట్ అంటూ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తిన కేటీఆర్
- క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై కుట్ర ఆరోపణ
- సుమన్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్ అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని అడ్డదారుల్లో కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి దౌర్జన్యంగా దాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రలో భాగంగానే సుమన్‌పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించారని పేర్కొన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా క్యాతన్‌పల్లి ప్రజలు బంద్ పాటించినా ప్రభుత్వం స్పందించలేదని కేటీఆర్ అన్నారు. కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పటికి కాంగ్రెస్ నేతలు చేసిన చర్యలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అక్రమ కేసులో అరెస్ట్ చేసిన బాల్క సుమన్‌ను ప్రభుత్వం తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.
Comments
