రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు ఊరట

హైదరాబాద్ – ఫిబ్రవరి 13 – పీపుల్స్ మోటివేషన్ 

గత మూడు నాలుగు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. ధరలు ఒక్కసారిగా కిందకు రావడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. బంగారం ధర గ్రాముకు రూ.2500కు పైగా తగ్గగా, వెండి ధర కిలోకు సుమారు రూ.15,000 వరకు తగ్గింది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ రోజు ఉదయం పది గంటల సమయానికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,55,780గా నమోదైంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2,620 తగ్గింది. అదే విధంగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,42,800కు చేరుకుని రూ.2,400 మేర తగ్గుదల నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. అక్కడ 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,55,930గా ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.1,42,950గా నమోదైంది.

వెండి ధర కూడా గణనీయంగా పడిపోయింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.8 లక్షలుగా ఉంది. ఇదే ధర ఢిల్లీలోనూ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు డిమాండ్ తగ్గుదల కారణంగా ధరల్లో ఈ తగ్గుదల కనిపించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Comments

-Advertisement-