రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ కలెక్టర్‌కు జైలు శిక్ష

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ కలెక్టర్‌కు జైలు శిక్ష

  • ఆరు నెలల జైలు శిక్ష విధించిన హైకోర్టు
  • రెండు వేల రూపాయల జరిమానా కూడా విధింపు
  • న్యాయస్థాన ఆదేశాల అమలుపై తీవ్ర వ్యాఖ్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, 18 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ, రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేసు వివరాల ప్రకారం భూహక్కులకు సంబంధించి ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, వివాదంలోని ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కోర్టు విధించిన గడువు ముగిసినా ఆదేశాల అమలులో పురోగతి లేకపోవడంతో సంబంధిత మహిళ మళ్లీ కోర్టును ఆశ్రయించారు. కలెక్టర్ తన సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా న్యాయస్థాన ఆదేశాలను బేఖాతరు చేశారని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిగింది. విచారణలో ధర్మాసనం కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం న్యాయ వ్యవస్థకు అవమానమని వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై కలెక్టర్ రాహుల్ రాజ్ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసే అవకాశం ఉందని న్యాయ వర్గాలు సూచిస్తున్నాయి. తీర్పు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పరిపాలనా వర్గాల్లో చర్చ సాగుతోంది

Comments

-Advertisement-