రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అలియాబాద్‌లో హంగ్ మున్సిపాలిటీ.. స్వతంత్ర అభ్యర్థి కీలకం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అలియాబాద్‌లో హంగ్ మున్సిపాలిటీ.. స్వతంత్ర అభ్యర్థి కీలకం

  • 20 వార్డుల్లో ఏ పార్టీకి మెజార్టీ లేదు
  • ఛైర్మన్ పదవికి కాంగ్రెస్–బీఆర్‌ఎస్ పోటీ
  • స్వతంత్రులతో చర్చలు జోరుగా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మొత్తం 20 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 8, భారత రాష్ట్ర సమితి 7, భారతీయ జనతా పార్టీ 3, బీఎస్పీ 1 స్థానంలో విజయం సాధించాయి. ఏడో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి గాదె వెంకటేశ్ గెలుపొందారు. మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకోవడానికి కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా స్వతంత్ర అభ్యర్థి గాదె వెంకటేశ్‌తో చర్చలు జరుపుతున్నాయి. అయితే ఛైర్మన్ పదవిని తనకు ఎవరు ఇస్తే వారికి మద్దతు ఇస్తానని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కౌంటింగ్ కేంద్రంలోనికి వెళ్లే సమయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు గాదె వెంకటేశ్‌ను అడ్డుకుని మద్దతు కోసం ప్రయత్నించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఆయనను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లారు. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో 26 వార్డులకు గాను బీఆర్‌ఎస్ 12, కాంగ్రెస్ 10, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. దీంతో స్వతంత్రులను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చర్చలు జరుపుతూ క్యాంపు రాజకీయాలు ముమ్మరం చేస్తున్నాయి.

Comments

-Advertisement-