రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హామీలు అమలు చేస్తున్నందుకే ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం: జూపల్లి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హామీలు అమలు చేస్తున్నందుకే ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం: జూపల్లి

  • 70 శాతానికి పైగా మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు
  • ఆర్థిక ఇబ్బందులున్నా గ్యారెంటీల అమలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):
హామీలు అమలు చేస్తున్నందుకే ఎన్నికలేవైనా ప్రజలు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కొల్లాపూర్ సహా రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ మున్సిపల్ ఫలితాలే పునరావృతమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందని, అందుకే ప్రతి ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా ఆరు గ్యారెంటీలు సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని జూపల్లి తెలిపారు. ఎన్నికల్లో ప్రస్తావించని పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఈ విధానాలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

Comments

-Advertisement-