బాబర్ ఆజం ఓపెనర్‌గా సరిపోడు.. మైక్ హెసన్ వ్యాఖ్యలు
బాబర్ ఆజం ఓపెనర్‌గా సరిపోడు.. మైక్ హెసన్ వ్యాఖ్యలు
లాహోర్ – ఫిబ్రవరి 22 – పీపుల్స్ మోటివేషన్
టీ20 ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం బ్యాటింగ్ క్రమంపై పెద్ద చర్చ నడుస్తోంది. సాధారణంగా ఆరంభ బ్యాటర్‌గా బరిలోకి దిగే బాబర్‌ను ఈసారి నాలుగో స్థానంలో ఆడించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాన కోచ్ మైక్ హెసన్ అసలు కారణాలను వెల్లడించారు.
ప్రపంచకప్ పోటీల్లో ఆరంభ ఓవర్లలో బాబర్ పరుగుల వేగం వంద కంటే తక్కువగా ఉందని హెసన్ తెలిపారు. ఆధునిక టీ20 తరహాలో తొలి ఆరు ఓవర్లలో వేగంగా పరుగులు చేయడం అత్యంత ముఖ్యమని, ఆ దశలో దూకుడుగా ఆడే ఆటగాళ్లు అవసరమని చెప్పారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బాబర్‌ను మధ్య వరుసలోకి మార్చినట్లు వివరించారు.
ఆసియా కప్ తర్వాత బాబర్‌కు ప్రత్యేక పాత్ర కేటాయించామని, ఇన్నింగ్స్ కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును నిలబెట్టగల సామర్థ్యం అతనికి ఉందని హెసన్ పేర్కొన్నారు. అయితే మధ్య దశలో వేగంగా పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో ఇతర దూకుడు ఆటగాళ్లు జట్టులో ఉన్నారని తెలిపారు.
ఈ నిర్ణయం బాబర్‌పై బలవంతంగా తీసుకోలేదని, జట్టు మేలు కోసం అతడూ అంగీకరించాడని హెసన్ వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో ఇతర ఆటగాళ్లు వేగంగా ఆడగలరని బాబర్ స్వయంగా అర్థం చేసుకున్నాడని చెప్పారు.
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు సూపర్ 8 దశకు సిద్ధమవుతోంది. ఈ దశలో ఇదే బ్యాటింగ్ క్రమాన్ని కొనసాగిస్తారా, లేక బాబర్‌ను మళ్లీ ఆరంభ బ్యాటర్‌గా పంపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం తమ స్టార్ ఆటగాడిని మళ్లీ మొదటి స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు.
