ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర ఆరోపణలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర ఆరోపణలు
- సోదరుడి ప్రాణాలకు ముప్పు ఉందని కుటుంబ సభ్యుల ఆందోళన
- సైనికాధికారులు, పీసీబీ చీఫ్‌పై ఆరోపణలు
- జైలులో ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం
ఇస్లామాబాద్, 18 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ఆయన సోదరీమణులు ఉజ్మా ఖాన్, అలీమా ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ సైనికాధికారి అసిమ్ మునీర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహిసిన్ నఖ్వీ తమ సోదరుడి ప్రాణాలకు ముప్పుగా ఉన్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయం స్వయంగా ఇమ్రాన్ ఖాన్ తమకు వెల్లడించారని, తనను చంపేందుకు పథకం వేశారని చెప్పారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమకు లేదా తమ సోదరుడికి ఏదైనా జరిగితే బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండి జైలులో నిర్బంధంలో ఉన్నారు. జైలులో ఎక్కువ కాలం ఒంటరిగా ఉండటం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కంటి చూపు తగ్గుతున్నదని, కుడి కన్నులో చూపు గణనీయంగా కోల్పోయినట్లు సమాచారం. ఈ ఆరోపణల నేపథ్యంలో పాకిస్థాన్ రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత పెరిగింది. కుటుంబ సభ్యుల వ్యాఖ్యలపై అధికార వర్గాల స్పందన కోసం ఆసక్తి నెలకొంది. పరిస్థితిని అంతర్జాతీయ వర్గాలు కూడా గమనిస్తున్నాయి.
Comments
