రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భర్త మృతిని తట్టుకోలేక చెరువులో దూకిన మహిళ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

భర్త మృతిని తట్టుకోలేక చెరువులో దూకిన మహిళ

  • నర్సాపూర్ మండలంలో విషాద ఘటన
  • నాలుగు నెలల క్రితం భర్త మృతి
  • కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

నర్సాపూర్, 14 ఫిబ్రవరి 2026 (పీపుల్స్ మోటివేషన్):
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. చిన్నచింతకుంట గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మీ (58) ఈ దుర్ఘటనకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై రంజిత్ కుమార్ వివరాల ప్రకారం, లక్ష్మీ భర్త శివరాములు నాలుగు నెలల క్రితం మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె తీవ్ర మనోవేదనలో ఉండేదని కుటుంబసభ్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామ సమీపంలోని చెరువులోకి వెళ్లిన లక్ష్మీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల వెతికిన సమయంలో చెరువు గట్టు వద్ద లక్ష్మీ చెప్పులు కనిపించడంతో అనుమానం వ్యక్తమైంది. వెంటనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చీకటి పడటంతో శుక్రవారం రాత్రి గాలింపు నిలిపివేశారు. శనివారం ఉదయం మళ్లీ చెరువు వద్దకు వెళ్లి చూడగా లక్ష్మీ మృతదేహం ఒడ్డున పడి ఉన్నట్లు గుర్తించారు. తన తండ్రి మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన తన తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు కుమారుడు సాయి తేజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Comments

-Advertisement-