రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కామ్రేడ్ నల్లమల కమలాదేవి కన్నుమూత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కామ్రేడ్ నల్లమల కమలాదేవి కన్నుమూత

  • సీపీఐ అగ్రనేత గిరిప్రసాద్ సతీమణి మృతి
  • జూబ్లీహిల్స్‌లో భౌతిక కాయానికి నివాళులు
  • మహాప్రస్థానంలో సాయంత్రం అంత్యక్రియలు
  • కూనంనేని సంతాపం

హైదరాబాద్, 14 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): సీపీఐ అగ్రనాయకులు కామ్రేడ్ నల్లమల గిరిప్రసాద్ సతీమణి నల్లమల కమలాదేవి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో వామపక్ష వర్గాల్లో విషాదం నెలకొంది. నల్లమల కమలాదేవి భౌతిక కాయాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు జూబ్లీహిల్స్‌లోని ఆమె పెద్ద కుమార్తె నివాసంలో సందర్శనార్థం ఉంచనున్నారు. బంధువులు, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు నివాళులు అర్పించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

కమలాదేవి మృతిపట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సంతాపం ప్రకటించారు. ఆమె తన భర్త గిరిప్రసాద్ పోరాటంలో అనునిత్యం భాగస్వామ్యమై ఆయనకు అండగా నిలిచారని గుర్తుచేశారు. కుటుంబ సభ్యులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొన్నారు. వామపక్ష ఉద్యమాలకు మౌనంగా తోడ్పాటునందించిన వ్యక్తిగా కమలాదేవిని పలువురు స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నాయకులు ఆకాంక్షించారు.

Comments

-Advertisement-