రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నల్గొండలో తాగుబోతుల వీరంగం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నల్గొండలో తాగుబోతుల వీరంగం

  • ఇంట్లో నుంచి యువకుడిని లాక్కొచ్చి దాడి
  • దాడి వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

నల్గొండ, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి తాగుబోతుల వీరంగం కలకలం రేపింది. నిడుమనూరు గ్రామంలో మద్యం మత్తులో ఉన్న ఓ రౌడీ గ్యాంగ్, ఒక యువకుడిని ఇంటి నుంచి బలవంతంగా లాక్కొచ్చి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, దుండగులు యువకుడిని కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దుతూ దారుణంగా కొట్టారు. ఈ దాడిని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. తమ జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని బెదిరింపులు కూడా చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితుల గుర్తింపుపై దృష్టి సారించారు. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు సమాచారం. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Comments

-Advertisement-