రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రజా విశ్వాసమే మా బలం: బట్టి విక్రమార్క

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ప్రజా విశ్వాసమే మా బలం: బట్టి విక్రమార్క

- మున్సిపల్ ఫలితాలు ప్రజా పాలనకు మద్దతు

- విద్య, వైద్యం, ఉపాధిపై ప్రభుత్వ కట్టుబాటు

- పారదర్శక పాలన బలోపేతానికి సంకల్పం

హైదరాబాద్, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్): మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ప్రజా పాలనపై ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసానికి ప్రతీకగా నిలిచాయని ఉప ముఖ్యమంత్రి మల్లూ భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ విజయాన్ని ప్రజల ఆశీర్వాదంగా స్వీకరిస్తున్నామని, అదే సమయంలో మరింత బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

గత రెండేళ్లుగా విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబాటుతో పనిచేస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ధృఢ సంకల్పంతో తీసుకున్న నిర్ణయాలకు ఈ ఎన్నికల ఫలితాలు మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం సమన్వయంతో అభివృద్ధి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమలవుతున్నాయని, అదే ప్రజా మద్దతుకు కారణమని చెప్పారు.

కార్యకర్తల శ్రమకు, ప్రజల అపార మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మరింత పారదర్శకతతో, మరింత బాధ్యతతో ప్రజా పాలనను బలోపేతం చేయడం తమ సంకల్పమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Comments

-Advertisement-