రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు: పవన్ కల్యాణ్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు: పవన్ కల్యాణ్

తిరుమల ఘటనలపై గత ప్రభుత్వంపై విమర్శలు

శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గం ప్రారంభం

22 ప్రధాన దేవాలయాలకు రహదారి వసతులు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):
పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో ఎన్నో అపచారాలు చోటుచేసుకున్నాయని, నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరించి ఉంటే ఆ పరిస్థితులు వచ్చేవి కాదని విమర్శించారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ సిమెంటు రహదారి ద్వారా భక్తులకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆలయాలు మన నాగరికత, సంస్కృతి, వారసత్వానికి చిహ్నాలని పేర్కొన్నారు. అరుణాచలం తరహాలో శ్రీకాళహస్తిలోనూ గిరిప్రదక్షిణ చేయాలన్న కోరిక తనకుందని, త్వరలో క్షేత్రాన్ని సందర్శించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటానని తెలిపారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం గిరిప్రదక్షిణ మార్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. ప్రతి పౌర్ణమికీ కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని నూతన ట్రస్ట్ బోర్డుకు సూచించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గనిర్దేశకత్వంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేవాదాయ శాఖ సహకారంతో రూ.40 కోట్లకు పైగా నిధులతో సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రహదారి వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కోటప్పకొండ, వాడపల్లి, ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురం వంటి క్షేత్రాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సనాతన ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

-Advertisement-