రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అసెంబ్లీ లాబీలో నవ్వులు పూయించిన నేతల సరదా సంభాషణ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అసెంబ్లీ లాబీలో నవ్వులు పూయించిన నేతల సరదా సంభాషణ

బరువు తగ్గడంపై బాలకృష్ణ చమత్కారం

“ఇంకా తగ్గకు… నాకు పోటీ వస్తావ్” వ్యాఖ్య

సరదాగా సాగిన రాజకీయ ప్రస్తావన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేతల మధ్య ఆసక్తికర సంభాషణలు, సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అసెంబ్లీ లాబీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్య జరిగిన చమత్కార సంభాషణ అక్కడ నవ్వులు పూయించింది. అసెంబ్లీ లాబీలో మంత్రి అనగానితో మాట్లాడుతున్న బాలకృష్ణ, అటుగా వచ్చిన బొజ్జల సుధీర్ రెడ్డిని చూపిస్తూ సరదాగా “బొజ్జల సుధీర్ రెడ్డి బరువు తగ్గానంటున్నాడు… మీకేమైనా తేడా కనిపిస్తుందా?” అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన బొజ్జల “అన్నాయ్, ఇప్పటికే 15 కిలోలకు పైగా తగ్గాను… ఇంకా తగ్గమంటావా?” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యతో అక్కడి వాతావరణం మరింత హాస్యభరితంగా మారింది. వెంటనే బాలకృష్ణ తనదైన శైలిలో “ఇంకా తగ్గకు… మళ్లీ నాకు పోటీ వస్తావ్” అంటూ ఛలోక్తి విసిరారు. ఆ వ్యాఖ్యతో అక్కడున్న సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు. అసెంబ్లీ గంభీర చర్చల మధ్య ఇలాంటి సరదా సన్నివేశాలు చోటుచేసుకోవడం సభ్యులకు కొంత ఉపశమనం కలిగించింది.

ఈ క్రమంలో బొజ్జల సుధీర్ రెడ్డి సరదాగా “ప్రజలు మిమ్మల్ని, లోకేశ్ గారిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అనుకుంటున్నారు” అని వ్యాఖ్యానించగా, బాలకృష్ణ అంతే చమత్కారంగా “నాకు కొన్ని విషయాలు వినపడవు” అని బదులిచ్చి ముందుకు సాగారు. అసెంబ్లీ సమావేశాల మధ్య జరిగిన ఈ హాస్య సంభాషణ సభ్యుల్లో ఉల్లాసాన్ని నింపింది.

Comments

-Advertisement-