రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మసీదు భూమి నమోదు కోసం లంచం.. డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మసీదు భూమి నమోదు కోసం లంచం.. డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్

  • రూ.10 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
  • పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడి
  • మసీదు 36 ఎకరాల భూమి ఆన్‌లైన్ నమోదు వివాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):
మసీదుకు చెందిన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు లంచం తీసుకున్న డిప్యూటీ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కడప జిల్లా పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న నాగేంద్రప్రసాద్ రూ.10 వేల లంచం స్వీకరిస్తుండగా అధికారులు దాడి చేసి అరెస్ట్ చేశారు. చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామంలో మసీదుకు చెందిన 36 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ మసీదు కమిటీ సభ్యులు అధికారులను సంప్రదించినట్లు సమాచారం. అయితే భూమి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలంటే లంచం ఇవ్వాలని నాగేంద్రప్రసాద్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు కరీముల్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పన్నిన ఉచ్చులో అధికారి చిక్కుకున్నాడు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ అధికారిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటనతో రెవెన్యూ శాఖలో కలకలం రేగింది.

Comments

-Advertisement-