పది ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి
పది ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించండి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
కర్నూలు, ఫిబ్రవరి 13 (పీపుల్స్ మోటివేషన్):-
10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్ లను, ఎస్పీ లను ఆదేశించారు.
శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కలెక్టర్ లు, ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లను ఆదేశించారు. సమస్యాత్మక, సున్నితమైన కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్యా , వైద్య, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖలతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని, విద్యార్థులు, ఇన్విజిలేటర్లు ఎవరూ కూడా స్మార్ట్ వాచీలు లేదా సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రంలోకి తీసుకురాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు భవనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లను ఆదేశించారు.
పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ లో భాగంగా రేషన్ సరుకులు సరఫరా, విద్యుత్ సరఫరా, మిడ్ డే మిల్స్, తదితర అంశాల మీద ప్రజల నుండి సానుకూల స్పందన తీసుకొని రావాలని కలెక్టర్ లను ఆదేశించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే లో పురోగతి తీసుకొని రావాలన్నారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలను సక్రమంగా అమలు చేసి, ప్రజల్లో సానుకూల స్పందన వచ్చేలా చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో డిఈఓ సుధాకర్, ఆర్ఐఓ లాలప్ప, తదితరులు పాల్గొన్నారు.

