రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కమిటీ సమావేశాలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కమిటీ సమావేశాలు

- నియామకాలు, కారుణ్య నియామకాలపై సమీక్ష

- గ్రాట్యుటీ, పే ఫిక్సేషన్ అంశాల పరిశీలన

- పలువురు జిల్లాల సహకార అధికారులు హాజరు

ఆదిలాబాద్, 18 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో తొమ్మిదవ జిల్లా స్థాయి సాధికారత కమిటీ, జిల్లా స్థాయి పర్యవేక్షణ సమీక్షా కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు జిల్లా కలెక్టర్, డిఎల్ఈసి చైర్మన్ రాజర్షి షా అధ్యక్షత వహించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులకు సంబంధించిన నియామకాలు, కారుణ్య నియామకాలు, గ్రాట్యుటీ మంజూరు, ఉద్యోగుల పే ఫిక్సేషన్, ఇతర పరిపాలనా అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా సహకార అధికారి మోహన్, మంచిర్యాల జిల్లా సహకార అధికారి ఎం సత్యనారాయణ, నిర్మల్ జిల్లా సహకార అధికారి జె నర్సయ్య, నాబార్డ్ డిడిఎం అబ్దుల్ రావూఫ్, వీరభద్రుడు, ఇన్ చార్జ్ సీఈఓ సిహెచ్ రవి, జీఎం ఇ సూర్య ప్రకాశ్, డీజీఎం టి వెంకటేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు.

సహకార రంగం బలోపేతానికి పారదర్శక విధానాలు అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగుల సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించి, మహిళా సాధికారత, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయం, బాధ్యతాయుత వ్యవహారం అవసరమని స్పష్టం చేశారు.

Comments

-Advertisement-