ప్రీ-బడ్జెట్ సమీక్షలో ఇరిగేషన్, సివిల్ సప్లైస్‌పై దృష్టి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ప్రీ-బడ్జెట్ సమీక్షలో ఇరిగేషన్, సివిల్ సప్లైస్‌పై దృష్టి
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం
- సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత సన్న బియ్యం పథకంపై చర్చ
- సమగ్ర అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యం
హైదరాబాద్, 18 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ మరియు సివిల్ సప్లైస్ శాఖలపై ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నిర్వహించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్య కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఆహార భద్రత కార్డు అమలు, ఉచిత సన్న బియ్యం పథకం అమలు విధానం, ప్రజలకు సమర్థవంతమైన సేవలందించే చర్యలపై సమావేశంలో సమగ్ర సమీక్ష చేపట్టారు. ప్రతి పథకం లక్ష్యాలకు అనుగుణంగా అమలు కావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శాఖల వారీగా పురోగతిని వివరించి, రాబోయే బడ్జెట్‌లో కేటాయింపులపై చర్చించారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధి, పారదర్శకత, బాధ్యతాయుత పాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
