రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలు నిరాధారం: మంత్రి అచ్చెన్నాయుడు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హెరిటేజ్‌పై వైసీపీ ఆరోపణలు నిరాధారం: మంత్రి అచ్చెన్నాయుడు

  • చీజ్‌ను నెయ్యి అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణ
  • ఇందాపూర్–హెరిటేజ్‌కు సంబంధం లేదని స్పష్టీకరణ
  • ఆధారాలు లేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
హెరిటేజ్ సంస్థపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. శాసనమండలిలో మాట్లాడిన ఆయన, చీజ్ ప్యాకెట్లను చేతిలో పట్టుకుని వాటిని నెయ్యి అంటూ చూపిస్తూ ప్రజలను, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వైసీపీ సభ్యుల తీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని గత రెండు రోజులుగా స్పష్టంగా సమాధానం ఇస్తున్నప్పటికీ, అదే అంశాన్ని పట్టుకుని సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించి, “చీజ్ ప్యాకెట్లను చూపిస్తూ నెయ్యి ప్యాకెట్లు అంటున్నారు. చీజ్‌కు, నెయ్యికి మధ్య తేడా కూడా తెలియదా?” అని ఎద్దేవా చేశారు. హెరిటేజ్‌పై అనుమానాలుంటే కనీసం ఒక ఆధారమైనా సభ ముందు ఉంచాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్య ప్రచారాలపై హెరిటేజ్ సంస్థ ఇప్పటికే లీగల్ నోటీసులు పంపిందని గుర్తుచేశారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నేతలపైనే ఉందన్నారు. గతంలో ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని సంస్థల పేరుతో ధన దోపిడీ చేసిన చరిత్ర వైసీపీదని ఆరోపించారు. వాయిదా తీర్మానాలతో సభను పక్కదారి పట్టించడం మానుకుని, దమ్ముంటే ఆధారాలతో నిర్మాణాత్మక చర్చకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. పారదర్శకతతో వ్యాపారం చేస్తున్న సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడం తగదని ఆయన స్పష్టం చేశారు.

Comments

-Advertisement-