మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ – ఫిబ్రవరి 20, – పీపుల్స్ మోటివేషన్
అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంతో శుక్రవారం భారతదేశంలో బంగారం, వెండి ధరల్లో మళ్లీ పెరుగుదల నమోదు అయింది. అంతర్జాతీయ మార్కెట్లు ప్రభావితమవుతూనే, ఇండియాలో కూడా పెరుగుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఎమ్‌సీఎక్స్‌లో 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1,53,000 మార్క్ వద్ద నిలిచినట్లు నమోదు అయ్యింది. సిల్వర్ ఫ్యూచర్స్ ధర కూడా స్వల్పంగా పెరిగి రూ.2,43,000కు చేరింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం స్పాట్ ధర 5,010 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే, డాలర్ బలంగా ఉండటం వల్ల లోహాల ధరల పెరుగుదల మధ్యస్థాయి పరిమితిలోనే ఉంది అని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ప్రస్తుతం రూ.1,56,170, 22 క్యారెట్ బంగారం ధర రూ.1,43,150గా ఉంది. కిలో వెండి ధర రూ.2.7 లక్షల వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,57,310గా, ముంబైలో రూ.1,56,170గా నమోదయ్యింది. ఈ రెండు నగరాల్లో వెండి రేట్లు కూడా రూ.2.7 లక్షల వద్ద నిలిచాయి. ఈ సమాచారం పాఠకులకు అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది; బంగారం, వెండి ధరలు పరిస్థితులకు అనుగుణంగా మారుతూనే ఉంటాయి.
