రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మదనపల్లెలో బాలిక హత్యపై సీఎం తీవ్ర స్పందన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మదనపల్లెలో బాలిక హత్యపై సీఎం తీవ్ర స్పందన

- తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శ

- నిందితుడికి కఠిన శిక్ష హామీ

పోక్సో చట్టం కింద కేసు నమోదు

అన్నమయ్య జిల్లా, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్): అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏడేళ్ల బాలిక దారుణ హత్యకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరామర్శించిన ఆయన, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మూడు రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మృతదేహం చివరకు ఎదురింట్లో గుర్తించబడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అదే ప్రాంతంలో నివసిస్తున్న కులవర్ధన్ అనే వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు మదనపల్లె–కదిరి బైపాస్ రోడ్డుపై ఆందోళనకు దిగారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ, ఉప కలెక్టర్ ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. హోం మంత్రి వంగలపూడి అనిత కూడా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బెయిల్ రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల భరోసాతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించి, బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు అంగీకరించారు.

Comments

-Advertisement-