స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై రాష్ట్రస్థాయి సమీక్ష
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై రాష్ట్రస్థాయి సమీక్ష
- మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశం
- బూత్ స్థాయి అధికారుల ఫీల్డ్ విజిట్ తప్పనిసరి
- జగిత్యాలలో వంద శాతం పూర్తి లక్ష్యం
జగిత్యాల, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్): హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడిఓసి కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, రివిజన్ శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి ఖచ్చితమైన వివరాలు సేకరించి, మ్యాపింగ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
బూత్ లెవల్ అధికారులు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేసి ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు తమ బూత్ లెవల్ ఏజెంట్లను వెంటనే నియమించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పు ఎంట్రీలు, తప్పు లింకింగ్‌లు జరగకుండా పర్యవేక్షణ పెంచాలని, ఓటర్ల సౌలభ్యం కోసం “బుక్ ఎ కాల్” సదుపాయంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వంద శాతం పూర్తయ్యేలా అన్ని స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి ఓటరు సరైన పోలింగ్ స్టేషన్‌కు మ్యాప్ అయ్యేలా ఖచ్చితమైన వివరాలు సేకరించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, జగిత్యాల మరియు కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు హకీమ్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

